NTV Telugu Site icon

Vijay Deverakonda: హ్యాపెనింగ్ హీరోయిన్ పై కన్నేసిన విజయ్.. నెక్స్ట్ మూవీ ఆమెతోనే?

Vijay Deverakonda

Vijay Deverakonda

Mamitha Baiju to Star Opposite Vijay Deverakonda: ఈ మధ్యనే ఇది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. విమర్శకుల ప్రశంసలు దక్కకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సినిమా యూనిట్ చెబుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన హీరోయిన్ ని తీసుకున్నారు అంటూ ప్రచారం మొదలైంది.

Unstoppable 4: బాలయ్య మళ్లీ వస్తున్నాడు గెట్ రెడీ

ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు ఈ మధ్యనే ప్రేమలు అనే సినిమాతో తెలుగు ఆడియోస్ కి కూడా పరిచయమైన మమితా బైజు. ఈ మలయాళ భామ మలయాళంలో ఎన్నో సినిమాలు చేసి ప్రేమలు అనే సినిమాతో సూపర్ క్రేజ్ అందుకుంది. అది తెలుగు డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేయడంతో తెలుగులో కూడా ఈమెకు గట్టిగా అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు ఈ భామ ని విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె టీం తో సంప్రదింపులు జరుపుతున్నారని దాదాపుగా ఆమెను ఫిక్స్ చేయడం ఖాయమే అని తెలుస్తోంది. అయితే ఒకవేళ ఆమెకు స్క్రిప్ట్ నచ్చకపోవడమో లేక ఏదైనా ఇతర కారణాలు ఉండడం వల్ల తప్పుకుంటే రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న భాగ్యలక్ష్మి బోర్సే అనే హీరోయిన్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని, వీరిద్దరిలో దాదాపుగా ఒకరు ఖాయం అని అంటున్నారు. చూడాలి మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది.

Show comments