NTV Telugu Site icon

Mamatha Mohan Das: ఆ తప్పు చేశా.. రాజమౌళి అన్న మాటతో గుండె పగిలింది

Mamatha

Mamatha

Mamatha Mohan Das: ఒక కొత్త అమ్మాయి ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది అంటే ఎన్నో భయాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా వేరే భాషలో ఎంట్రీ ఇవ్వాలంటే.. ఆ బ్యానర్ ఏంటి..? హీరో ఎవరు..? అందరు బాగా చూసుకుంటారా..? అనే అనుమానాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయ. కొన్నిసార్లు ఆ భయాల వలనే మంచి సినిమా అవకాశాలను చేజార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా తాను కూడా ఆ భయం వలనే ఒక మంచి హిట్ సినిమాను పోగొట్టుకున్నాను అని బాధపడింది మలయాళ బ్యూటీ మమతా మోహన్ దాస్. నటిగా, సింగర్ గా ఆమె తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను తెలుగులో మంచి హిట్ కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. ఆ సినిమా ఏదో కాదు అరుంధతి. అనుష్క ప్లేస్ లో మొదట మమతా మోహన్ దాస్ ను అనుకున్నారట. అయితే శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రొడక్షన్ బాగోదని మేనేజర్ చెప్పడంతో ఆమె ఆ సినిమాను వదిలేసినట్లు చెప్పుకొచ్చింది.

Ram Charan: నేను తండ్రి కాబోతున్న విషయం అందరికన్నా ముందు అతనికే చెప్పాను

“యమదొంగ సినిమాలో ఛాన్స్ కోసం రాజమౌళి గారు కాల్ చేశారు. నేను వెంటనే ఒప్పుకున్నాను. అయితే.. అదే నా మొదటి సినిమా ఆఫర్ అనుకున్నారు. కానీ, ఈ సినిమాకన్నా ముందే నాకు అరుంధతి సినిమా ఆఫర్ వచ్చింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి బ్యానర్ బాగోదని మేనేజర్ చెప్పడంతో దాన్ని వదిలేశాను. శ్యామ్ గారు రెండు నెలలు నన్ను అడిగారు. ఇక ఈ విషయాన్నీ రాజమౌళి గారికి యమదొంగ షూటింగ్ లో చెప్పాను. ఆయన.. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావ్.. అరుంధతి సినిమా నువ్వు చేయాల్సింది..చాలా గొప్ప నటివి అయ్యేదానివి అన్నారు. ఆ తప్పు చేసినందుకు నేను చాలా బాధపడ్డా.. ఇక రాజమౌళి గారు అలా అనేసరికి నా గుండె పగిలింది” అని చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే.. అరుంధతి కనుక మమతా చేసి ఉంటే.. ఆమె రేంజ్ ఇప్పుడు వేరే లెవెల్ లో ఉండేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఆ సినిమా చేయడంతోనే అనుష్క స్టార్స్ లిస్టులోకి చేరింది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతోంది. ఏదిఏమైనా ఎవరికి రాసి పెట్టి ఉన్న పాత్ర తిరిగి తిరిగి ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది అనడానికి ఇదే ఉదాహరణ. ప్రస్తుతం మమతా ఈ మధ్యనే క్యాన్సర్ బారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తోంది.

Show comments