Site icon NTV Telugu

Manjummel Boys: హిట్ సినిమా నిర్మాతలు మోసం చేశారా?

Love Letter To Manjummel Boys By Bhargav Chaganti

Love Letter To Manjummel Boys By Bhargav Chaganti

Malyalam Hit Film Manjummel Boys Producers Accused Of Fraud In Profit Sharing: మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ ఈ ఏడాది విజయవంతమైన సినిమాలలో ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేసింది. తెలుగులో కూడా మంచి టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. వాస్తవానికి, చిత్ర పెట్టుబడిదారు తరపున నిర్మాతలపై చీటింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది. మీడియా నివేదికల ప్రకారం, మంగళవారం ఎర్నాకుళం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కేరళ పోలీసులను చిత్ర నిర్మాతతో పాటు పరవ ఫిల్మ్స్, వారి సహచరుడు షాన్ ఆంటోనీపై ఫిర్యాదు చేయాలని కోరింది. ఈ విషయం లాభాల పంపిణీకి చెందినదిగా చెబుతున్నారు. ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఈ సినిమాకు వచ్చిన లాభంలో 40 శాతం షేర్ చేయలేదని సినిమాకి ఫైనాన్స్ చేసిన వ్యక్తి కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో షాన్‌ ఆంటోనీని ఫైనాన్స్ చేసిన సిరాజ్‌ వలియతార హమీద్‌ ప్రధాన నిందితుడిగా చేర్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే లాభాలను పంచుకుంటామని నిర్మాతలు హామీ ఇచ్చారని, అయితే అది నెరవేర్చలేదని హమీద్ ఆరోపించారు.

Loksabha 2024: తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగు నటి..

ఈ కేసులో షాన్ ఆంటోనీని కేరళ పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. అదే సమయంలో, ఫిర్యాదు తర్వాత, సినిమా నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాలో పెట్టుబడి పెడితే పెట్టుబడి పెట్టిన డబ్బులు వెనక్కి చేసిన తర్వాత 40 శాతం వచ్చే లాభాల వాటాన్ని కూడా ఇస్తామని తమకు అగ్రిమెంట్ చేసినట్లు ఫైనాన్షియల్ చెబుతున్నారు. ఈ క్రమంలో హమీద్ పరవ ఫిల్మ్స్ ఖాతాకు రూ.5.99 కోట్లు, షాన్ ఆంటోనీ ఖాతాకు రూ.50 లక్షలు పంపాడు. దీని తర్వాత కూడా హమీద్ మరో రూ.51 లక్షలు అప్పుగా ఇచ్చారు. నిర్మాతలు అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు అలాగే లాభాలను కూడా షేర్ చేయలేదు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒక యదార్థ సంఘటన స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రం. వెకేషన్‌లో ఉన్నప్పుడు గుహలో చిక్కుకున్న స్నేహితుల టీం కథే ఈ చిత్రం. ఇది ఫిబ్రవరి 22, 2024న విడుదలైంది. సకల్నిక్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.234.25 కోట్లు రాబట్టింది.

Exit mobile version