Site icon NTV Telugu

Malvi Malhotra: రాజ్ తరుణ్ కి మాల్వీ మల్హోత్రా వార్నింగ్.. ఏంటో తెలుసా?

Malvi Malhotra Warning To Raj Tarun

Malvi Malhotra Warning To Raj Tarun

Malvi Malhotra Warning to Raj Tarun: లావణ్య పోరు పడలేక తాను రాజ్ తరుణ్ కి వార్నింగ్ ఇచ్చినట్లు మాల్వి మల్హోత్రా వెల్లడించింది. నిజానికి చాలా కాలం పాటు తాను రాజ్ తరుణ్ తో మాట్లాడలేదని తన పుట్టినరోజుకి కూడా రాజ్ తరుణ్ తనకు విష్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అంతకుముందు లావణ్య బెదిరిస్తూ తన అడ్రస్ తో సహా మెసేజ్ చేసి అక్కడికి వచ్చి నీ పరువు తీస్తానని భయపెట్టేదని చెప్పుకొచ్చింది. అయితే తనకు ఈ విషయంలో ఇక విరక్తి కలిగి రాజ్ తరుణ్ కు మెసేజ్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. రాజ్, ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను ఇదే నా మొదటి, చివరి మెసేజ్. ఇక మీదట నాకు కాల్ గాని మెసేజ్ గాని చేయాలి అనుకోవద్దు.

Malvi Malhotra: రాజ్ తరుణ్ వీడియో.. అందులో తప్పేముంది?

నాకు మీ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ గా చెబుతున్న మహిళ నుంచి ఎలాంటి కాంటాక్ట్ ఉండకూడదు. ఇక మీదట నాకు ఎలాంటి ఫుడ్ పార్సెల్ కూడా పంపించవద్దు అని రాజ్ తరుణ్ కి మెసేజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. నేను తనకి బర్త్డే గిఫ్ట్ పంపిస్తే తాను నాకు బర్త్డే గిఫ్ట్ పంపించాడు. అంతకు మించి ఏమీ లేదు అలా పంపించినప్పుడు ఉన్న అడ్రస్సు సేవ్ చేసుకుని లావణ్య నన్ను బెదిరించింది. అందుకే రాజ్ తరుణ్ ఫోన్ నుంచి నా అడ్రస్ డిలీట్ చేయమని అడిగాను. ఈ విషయంలో నా పేరు తీసి ఆమెని ఇబ్బంది పెట్టవద్దు అలాగే ఏమీ చేయలేని వ్యక్తిగా ఉండకుండా నన్ను నా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి అని నేను రాజ్ తరుణ్ కి వార్నింగ్ ఇచ్చినట్లు మాల్వి చెప్పుకొచ్చింది.

Exit mobile version