Site icon NTV Telugu

Naresh – Pavitra: మళ్ళీ పెళ్లి జంట మరో సినిమా చేయబోతున్నారా..?

Whatsapp Image 2023 06 08 At 11.08.34 Am

Whatsapp Image 2023 06 08 At 11.08.34 Am

నటుడు నరేష్ ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. తన మూడవ భార్య రమ్య రఘుపతి కి విడాకులు ఇచ్చేందుకు నరేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆమె విడాకులు ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తుంది.. కానీ నరేష్ మాత్రం కచ్చితంగా ఆమె నుండి విడాకులు కావాల్సిందే అంటూ పట్టబడుతున్నాడు. త్వరలోనే వారికి విడాకులు మంజూరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం అయితే జరుగుతుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే నరేష్ ఇప్పటికే సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఈ ప్రేమ చాలా దూరం వరకు వెళ్ళింది. ఇద్దరు కూడా సహజీవనం సాగిస్తున్నారు అనే సంగతి అందరికీ తెలిసిందే.

ఒక సినిమా షూటింగ్ సందర్భంగా వీరికి పరిచయం ఏర్పడింది.. అప్పటి నుండి వారి రిలేషన్ కొనసాగుతుంది. నరేష్ మరియు పవిత్ర లోకేష్ ఇటీవల కలిసి మళ్లీ పెళ్లి అనే తమ సొంత కథనే తీసుకొని సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వివాదాస్పదం అయి ఈ జంట గురించి అసలు విషయాలు బయటకు అయితే వచ్చాయి. నరేష్ మరియు పవిత్ర లోకేష్ ప్రేమ వ్యవహారం బయట అందరికీ తెలిసి పోయింది. ఈ మధ్య కాలంలో నరేష్ మరియు పవిత్ర లోకేష్ కలిసి పదే పదే ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి కనిపిస్తూనే ఉన్నారు. మళ్ళీ పెళ్లి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇద్దరు ఏ స్థాయిలో సందడి అంతా ఇంతా కాదు.ఆ సినిమా నరేష్ స్వయంగా నిర్మించాడు. కమర్షియల్ గా సక్సెస్ అవ్వక పోయినా కూడా నరేష్ మరిన్ని సినిమాలు చేయాలని అయితే భావిస్తున్నాడు. అందులో కూడా పవిత్ర లోకేష్ తో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తుంది.ఇతర భాషల్లో సక్సెస్ అయిన కథలను తీసుకొని తెలుగు లో రీమేక్ చేసేందుకు నరేష్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం

Exit mobile version