హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ హీరోగా ఈ ఏడాది ఫుల్ ఫామ్‌లో ఉన్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌కు వృషభ రూపంలో గట్టి ఝలక్కే తగిలింది. చిన్న సినిమాలతో పోటీపడుతూ క్రిస్మస్‌కు వచ్చిన వృషభను తెలుగు ఆడియన్సే కాదు మలయాళీలు కూడా దేఖడం లేదు. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే.. హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలోనూ నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ దెబ్బకు తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 80 లక్షలకే పరిమితమైంది ఈ పాన్ ఇండియా సినిమా. రెండో రోజు కలెక్షన్స్ మరింత డ్రాప్ అయ్యాయి. వీకెండ్ కూడా మరింత దారుణమైన వసూళ్లు చూసింది. దీని కన్నా నివిన్ పౌలీ సర్వం మాయ కేవలం మలయాళంలో రిలీజై.. ఫస్ట్ డే రూ. 3.35 కోట్లు రాబట్టుకుని.. వీకెండ్ సమయానికి రూ. 10 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది.
Also Read : Tollywood 2025 : ఈ ఏడాదిలో ఫస్ట్ మూవీతో ఫ్లాప్స్ చూసి.. సెకండ్ మూవీతో హిట్ కొట్టిన హీరోలు వీరే
రూ. 70 కోట్ల రూపాయలతో తెరకెక్కిన వృషభ డిజాస్టర్‌కు కారణాలు అనేకం. పూర్ కంటెంట్.. పేలవమైన వీఎఫ్ఎక్స్ వెరిసి సినిమాను డ్యామేజ్ చేశాయి. వీక్ ప్రమోషన్స్ కూడా సినిమాపై మినిమం బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. మోహన్ లాల్ జస్ట్ ట్రైలర్ ఈవెంట్‌కు తప్ప పెద్దగా ప్రచారాల్లో పాల్గొన్న ఆనవాళ్లు కూడా లేవు. దీనికి తోడు ఈ మధ్య తీవ్రమైన నెగిటివిటీని మూటగట్టుకున్నారు లాలెట్టన్. హీరోయిన్‌పై ఎటాక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో దిలీప్‌కు కంప్లీట్ స్టార్ మద్దతుగా నిలవడం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. దిలీప్ భా భా బ మీద పెట్టిన కాన్సట్రేషన్.. తన ఓన్ సినిమాపై పెట్టలేదన్న కామెంట్స్ వినిపించాయి. తెలుగు సినిమాగా రిజిస్టరైందని పేరుకు మేకర్స్ చెబుతున్నప్పటికీ.. కన్నడ, మలయాళ, తెలుగు యాక్టర్స్‌ను ఆల్ మిక్సింగ్ చేసి కలిపికొట్టాడు కన్నడ దర్శకుడు నంద కిషోర్. దీంతో సినిమా ఎవరికీ కాకుండా పోయింది వృషభ. ఈ ఏడాది మూడు సినిమాలతో రూ. 580 కోట్లను వసూలు చేసిన లాలెట్టన్ వృషభకు ఫస్ట్ డే వన్ క్రోర్ కొల్లగొట్టలేకపోవడం కూడా ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. కేవలం మోహన్ లాల్‌ను ఫ్యామిలీ మ్యాన్‌గానే కాదు.. ఎంపురన్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు చేసినా ఆదరించిన మలయాళ ఆడియన్స్.. కంటెంట్ లేకపోతే స్టార్ హీరోస్ సినిమాలైనా తిప్పికొడతామని మరోసారి ఫ్రూవ్ చేశారు.
