Site icon NTV Telugu

Hesham Abdul Wahab: ‘స్పార్క్’ కోసం మలయాళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!

Spark

Spark

 

విక్రాంత్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా హై బ‌డ్జెట్‌తో డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’. మే నెల‌లో పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి కుంటోంది. సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తార‌ని మేక‌ర్స్ చెప్పారు. అలా చెప్పిన‌ట్లే ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ‘హృదయం’ సినిమాకు మ్యూజిక్‌ను అందించిన హెష‌మ్ వ‌హాబ్‌కు ‘స్పార్క్’ మూవీ సంగీత సార‌థ్య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.
‘హృదయం’ సినిమాలో ప్ర‌తి పాట ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే.

సూప‌ర్ స్టార్ డ‌మ్‌ను అందుకున్న హెష‌మ్ వ‌హాబ్ ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ – స‌మంత జంట‌గా న‌టించిన ‘ఖుషి’ సినిమాకూ ఆయనే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు ‘స్పార్క్’ సినిమాకు కూడా హెష‌మ్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ‘ఎఫ్ 3’ వంటి సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ చిత్రం త‌ర్వాత మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్ర‌మిది. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే యూర‌ప్‌లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో త‌దుప‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు.

Exit mobile version