NTV Telugu Site icon

Aavesham: ఫహద్ ‘ఆవేశం’తో మలయాళమోళ్ళు ఇంకో హిట్ కొట్టేశారు!

Aavesham

Aavesham

Malayalam Industry scored one more hit with Aavesham: జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాసిల్ నటించిన ‘ఆవేశం’ నిన్న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ షో తర్వాత నుంచి సినిమాకు మంచి ఆడియన్స్ రెస్పాన్స్ వస్తోంది. ఇంతకు ముందు కనిపించని ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కనిపించాడని అంటున్నారు ప్రేక్షకులు. బెంగళూరుకు చెందిన అండర్ వరల్డ్ డాన్ రంగాగా ఫహద్ నటిస్తున్నాడు. కాలేజీ పిల్లలు, వారిని రక్షించేందుకు వచ్చిన ఓ గాంగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఫస్ట్ షో తర్వాత మంచి మౌత్ పబ్లిసిటీ వస్తోంది. సినిమాకు ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. థియేటర్లలో నవ్వులతో హోరెత్తుతున్న ఈ సినిమాలో ఫహద్ అక్షరాలా చెలరేగిపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Yash: రావణుడు రామాయణం తీయబోతున్నాడు!

ఫస్ట్ హాఫ్, సెకండాఫ్‌లో హాస్యానికి లోటు లేదని, అయితే సెకండాఫ్‌లో కాస్త ల్యాగ్‌ వచ్చినా కథాంశంపై ప్రభావం చూపలేదని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. ‘రొమంచం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ మాధవన్ నుండి ప్రేక్షకులు ఈ సినిమా మరో నాణ్యమైన సినిమా అని అంటున్నారు. ఆశిష్ విద్యార్థి, సజిన్ గోపు, రోషన్, ప్రముఖ మలయాళీ గేమర్ – యూట్యూబర్ హిప్‌స్టర్, మిథున్ జెఎస్, పూజా మోహన్‌రాజ్, నీరజా రాజేంద్రన్, శ్రీజిత్ నాయర్, తంగం మోహన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ బ్యానర్‌పై అన్వర్ రషీద్ మరియు నజ్రియా నసీమ్ నిర్మించిన ఈ సినిమా కెమెరా సమీర్ తాహిర్ హ్యాండిల్ చేస్తున్నారు. వినాయక్ శశికుమార్ సాహిత్యం అందించగా సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు.