NTV Telugu Site icon

Heart Attack: నితిన్ దర్శకుడికి హార్ట్ ఎటాక్.. తీవ్ర విషమంగా హెల్త్ కండిషన్!

Nithin Director Heart Attck

Nithin Director Heart Attck

Siddique Ismail Heart Attack: ప్రముఖ సినీ దర్శకుడు సిద్దిక్ ఇస్మాయిల్ అభిమానులకు షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నిజానికి ఇప్పటికే న్యుమోనియా, కాలేయ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు ప్రకారం, సిద్దిక్ పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. మరోపక్క సిద్ధిక్‌కు గుండెపోటు వచ్చిందన్న వార్త బయటకు వచ్చిన తర్వాత, అతని అభిమానులు సోషల్ మీడియాలో అతనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిద్దిక్ ఎక్మో సపోర్ట్ (గుండె, ఊపిరితిత్తుల రోగులకు లైఫ్ సపోర్ట్)లో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Vrushabha: మోహన్ లాల్, రోష‌న్ ‘వృషభ’కి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్

ఆయన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి తదుపరి చికిత్స అందించేందుకు మంగళవారం ఉదయం మెడికల్ బోర్డు సమావేశం కానుందని తెలుస్తోంది. సిద్దిక్ ఇస్మాయిల్ 1954 ఆగస్టు 1న కొచ్చిలో ఇస్మాయిల్ హాజీ , జైనాబా దంపతులకు జన్మించాడు. ఆయన భార్య పేరు సజిత కాగా సుమయ, సారా, సుకూన్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఫహద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించిన ఆయన లాల్ తో కలిసి అనేక సినిమాలు డైరెక్ట్ చేశారు. సిద్దిఖ్-లాల్ ద్వయం ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. బాడీ గార్డ్, గాడ్ ఫాదర్, ఫ్రెండ్స్, హిట్లర్, బిగ్ బ్రదర్ లాంటి సినిమాలకు ఆయన డైరెక్టర్ గా వ్యహరిచారు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయి ఇక్కడ కూడా సక్సెస్ కాగా నేరుగా తెలుగులో నితిన్ తో మారో అనే సినిమా చేశారు సిద్దిఖీ.