jaison joseph:మాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళీ నిర్మాత జైసా జోసెఫ్ తన ఇంట్లో శవమై కనిపించాడు. గతరాత్రి కొచ్చిలోని అపార్ట్మెంట్ లో విగతజీవిగా కనిపించాడు. అయితే అతని మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒక్కసారిగా ప్రముఖ నిర్మాత మృతి ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. ఇంత చిన్న వయస్సులోనే జోసెఫ్ మరణం కలిచివేస్తోందని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఇకపోతే జోసెఫ్.. జమ్నా ప్యారి, బీజు మీనన్ హీరోగా నటించిన లవ కుశ లాంటి సినిమాలనుఁ నిర్మించాడు. త్వరలోనే ఆయన మృతికి గల కారణాలను తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.
