Site icon NTV Telugu

Lakshmika Sajeevan: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో యంగ్ హీరోయిన్ మృతి

Laksh

Laksh

Lakshmika Sajeevan: ఈ మధ్యకాలంలో గుండెపోటు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరోయిన్ గుండెపోటుతో మృతి చెందడం సెన్సేషన్ సృష్టిస్తోంది. మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మలయాళ హీరోయిన్ లక్ష్మీకా సజీవన్ గుండెపోటుతో మృతి చెందింది. అజు అజీష్ దర్శకత్వం వహించిన కాక్క అనే షార్ట్ ఫిల్మ్‌ తో కెరీర్ ను మొదలుపెట్టింది. పంచమి అనే పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక ఈ షార్ట్ ఫిల్మ్ తరువాత ఆమె పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె యూఏఈలో నివసిస్తోంది. ఇక గతరాత్రి ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. లక్ష్మీకా సజీవన్ వయస్సు 27 ఏళ్లు. ఇంత చిన్న వయస్సులో ఆమె ఇలా మృత్యువాత పడడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తుందని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version