Site icon NTV Telugu

Vishnu Prasad : దారుణం.. ట్రీట్ మెంట్ కు డబ్బుల్లేక స్టార్ యాక్టర్ మృతి..

Vishnu

Vishnu

Vishnu Prasad : సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటుడు విష్ణు ప్రసాద్ కన్ను మూశారు. ఆయన చికిత్సకు డబ్బుల్లేక తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన తాజాగా కన్నుమూశారు. మలయాళ ఇండస్ట్రీలో బుల్లితెరతో పాటు వెండితెరపై ఎన్నో పాత్రల్లో నటించారు. లైఫ్ సాఫీగా సాగుతున్న టైమ్ లో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. డాక్టర్లు టెస్టులు చేసి కాలేయ సమస్య అని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకున్నారు.

Read Also : Guntur: లేడీస్ హాస్టల్‌లో కెమెరాల కలకలం..
ఆయన కూతురు కాలేయం ఇవ్వడానికి కూడా సిద్ధం అయింది. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్. దీనికి రూ.30లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత డబ్బు తమ వద్ద లేదని.. దాతలు ఆదుకోవాలని వాళ్లు కోరారు. ఆర్థిక సాయం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ డబ్బులు సమకూరలేదు. దీంతో విష్ణు ప్రసాద్ పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన రన్ వే, లోకనాథన్, పటాకా, మరాఠా లాంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈయనకు పెళ్లి అయి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
Read Also : Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ‘గోట్’ ఆఫ్ ఐపీఎల్‌!

Exit mobile version