Site icon NTV Telugu

Shiyas Kareem: బిగ్ బాస్ నటుడు అరెస్ట్.. మహిళపై అత్యాచారం.. చిత్రహింసలు పెట్టి..

Shiyas

Shiyas

Shiyas Kareem: మలయాళ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ షియాస్ కరీమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై విమానాశ్రయంలో అతడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొన్నిరోజులుగా పరారీలో ఉన్న అతడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం .. షియాస్.. ఒక మహిళను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని, ఆమె దగ్గర నుంచి దాదాపు రూ. 11 లక్షలు తీసుకొని చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపారు. ఇక షియాస్ గురించి చెప్పాలంటే.. మలయాళంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రల్లో కనిపించే ఇతను.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెట్టి తనదైన గేమ్ తో అలరించాడు. బయటకు వచ్చాక మంచి మంచి సినిమాల్లో నటిస్తూ.. ఇంకోపక్క ఒక జిమ్ ను నడుపుతున్నాడు. ఆ జిమ్ లో మహిళా ట్రైనర్ తో షియాస్ రిలేషన్ లో ఉన్నాడు. ఆమెను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి .. ఆమెవద్దనుంచి రూ. 11 లక్షలు తీసుకున్నాడు.

Leo Trailer: విజయ్ నట విశ్వరూపం.. బ్లడీ స్వీట్ ఏ రేంజ్ లోనా

ఇక అంతేకాకుండా ఆమెపై అత్యాచారం కూడా చేశాడు. అనంతరం ముఖం చాటేశాడు. పెళ్లి గురించి అడిగితే 2021 ఏప్రిల్‌ నుంచి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని గత నెలలో కాసర్‌గోడ్‌లోని చందేరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇక అప్పటినుంచి అతడిని వెతుకుతున్న పోలీసులు.. నేడు చెన్నె ఎయిర్ పోర్టులో అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక షియాస్ మాత్రం ఆమె చెప్పేవన్నీ ఆరోపణలు మాత్రమే అని, నిజం కాదని చెప్పుకొస్తున్నాడు. ప్రస్తుతం ఈ అరెస్ట్ మలయాళ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Exit mobile version