NTV Telugu Site icon

Mammootty: మెగాస్టార్ ఇంట తీవ్ర విషాదం

Mammootty

Mammootty

Mammootty’s sister Ameena passes away at 70: మలయాళ ప్రముఖ నటుడు, మెగాస్టార్ గా పరిచయం ఉన్న మమ్ముట్టి ఇంట వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదే మమ్ముట్టి తల్లి మరణించగా ఆ విషాదం నుంచి బయట పడక ముందే ఆయన చెల్లెలు అమీనా కన్ను మూశారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. నసీమా అని కూడా పిలువబడే అమీనా, కంజిరపల్లి, పరక్కల్‌కు చెందిన దివంగత సలీమ్ పీఎం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. మలయాళ మీడియా చెబుతున్న దాని ప్రకారం, ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స పొందుతోంది. ఇక కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అమీనాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమీనా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

Nandamuri Balakrishna: నేనున్నాను.. నేను వస్తున్నాను..!

ఈరోజు లేదా రేపు అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది. మమ్ముట్టికి ఇది చాలా విషాదకరమైన సంవత్సరం, ఎందుకంటే అతను ఈ సంవత్సరమే తన తల్లిని కూడా కోల్పోయాడు. సూపర్ స్టార్ తల్లి, ఫాతిమా ఇస్మాయిల్, 93 ఏళ్ల వయసులో ఏప్రిల్ 21న తుదిశ్వాస విడిచారు. వయసు సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మెగాస్టార్ మమ్ముట్టి ఆయన తోబుట్టువులు వైకోమ్ సమీపంలోని చెంపులో పెరిగారు. మమ్ముట్టి నాన్న వ్యాపారవేత్త. అమీనా మృతితో మమ్ముట్టి, ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అదే సమయంలో, మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు అమీనా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రముఖులు మమ్ముట్టి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేసేందుకు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సందేశాలు పంపుతున్నారు. ఇక ఈ నెలలోనే మమ్ముట్టి 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టగా ఆయన కంటే రెండేళ్ల చిన్నదైన అమీనా మృతి చెందారు.

Show comments