అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ “ఏజెంట్”. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. తాజాగా ఆయన ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ‘ఏజెంట్’ నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘ది డెవిల్’ అంటూ మమ్ముట్టిని ‘ఏజెంట్’ అభిమానులకు పరిచయం చేశారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇందులో మమ్ముట్టి కూడా పాల్గొంటున్నారు.
Read Also : Radhe Shyam Press Meet : లైవ్
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కథానాయికగా సాక్షి వైద్య ఎంపికైంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రఘుల్ హెరియన్ ధరుమన్ కెమెరా బాధ్యతలు చేపట్టారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
