Malavika Mohanan : మాళవిక మోహనన్ ఇన్నేళ్లకు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కున్న విషయాలపై స్పందిస్తోంది. తాజాగా ఆమె చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కూడా జీవితంలో ఎన్నో ఘటనలు ఎదుర్కున్నాను. ఓ సారి ముంబై లోకల్ ట్రైన్ లో మా ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాణించారు. అప్పుడు గుర్తు తెలియని ఓ వ్యక్తి మా దగ్గరకు రావాలని చూశాడు. కంపార్టుమెంట్ వద్ద నిల్చుని ముద్దిస్తావా అంటూ సైగలు చేశాడు’ అంటూ తెలిపింది.
Read Also : PBK vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గెలుపు ఎవరిది?
‘అతని ప్రవర్తన చూసి మాకు చాలా భయం వేసింది. ఇంతలో వేరే స్టేషన్ కు వెళ్లాక మరికొంత మంది ప్రయాణికులు మాకు తోడుగా వచ్చారు. దాంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. సినిమాల్లోకి వచ్చాక కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. స్టార్ డమ్ ఉన్నంత మాత్రాన మనకు ఇబ్బందులు ఉండవని కాదు. అన్నింటికీ తట్టుకుని ముందుకు వెళ్తూనే ఉండాలి. ప్రతి రోజూ ఒకే విధంగా ఉండదు. అన్ని స్థాయిలను మనం ఆస్వాదించాలి. అంతే గానీ ప్రతి దానికి బాధపడకూడదు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.
