Site icon NTV Telugu

Malavika: నేను పవన్ సినిమాలో సెకండ్ లీడ్ కాదు… ప్రభాస్ సినిమాలో మెయిన్ లీడ్

Malavika Mohanan

Malavika Mohanan

దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ ‘మాస్టర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్న మాళవిక మోహనన్ డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది, పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తుంది అంటూ గత కొన్ని రోజులుగా ఒక రూమర్ స్ప్రెడ్ అయ్యింది. ఇది జస్ట్ గాలి వార్త మాత్రమే అంటూ మాళవిక మోహనన్ ట్వీట్ చేసింది.

“పవన్ కళ్యాణ్ సర్ అంటే అడ్మిరేషన్ ఉంది కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ లో నటించట్లేదు. ప్రస్తుతం నేను సెకండ్ హీరోయిన్ గా కాకుండా మెయిన్ లీడ్ గానే ఒక అదిరిపోయే తెలుగు సినిమాలో నటిస్తున్నాను, అదే నా తెలుగు డెబ్యు అవుతుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను” అంటూ మాళవిక మోహనన్ ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించట్లేదు అని క్లారిటీ ఇచ్చిన మాళవిక మోహనన్, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతీ తెరకెక్కిస్తున్న సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తోంది. హారర్ కామెడి జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో మాళవిక మోహనన్ తెలుగుతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి కూడా వెళ్ళబోతుంది. మరి మొదటి సినిమాతో ఈ మలయాళ బ్యూటీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version