NTV Telugu Site icon

Malavika Avinash: ఫోన్ చేసి బెదిరింపులు.. చిక్కుల్లో కేజీఎఫ్‌ నటి.. అసలేమైందంటే?

Malavika Avinash

Malavika Avinash

Malavika Avinash Aadhar Card Scam Revealed: యష్ నటించిన కేజిఎఫ్ సినిమాలో జర్నలిస్ట్ దీపా హెగ్డే పాత్రలో నటించిన మాళవిక అవినాష్ అనూహ్యంగా చిక్కుల్లో పడింది. ఈ సమాచారాన్ని మాళవిక స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆధార్ కార్డు దుర్వినియోగం గురించి తెలియజేసింది. నిజానికి ముంబై పోలీస్ స్టేషన్‌లో మాళవిక అవినాష్ పేరు మీద ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు మాళవికను పిలిచి విచారించారు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారంతో మాళవిక ఆశ్చర్యపోయారు. సైబర్ మోసగాళ్లు మాళవిక ఆధార్ కార్డును ఉపయోగించి సిమ్‌ను కొనుగోలు చేసి ఆ నంబర్‌తో పలువురికి బెదిరింపు, అసభ్యకర సందేశాలు పంపడంతో వేధింపులకు గురైన వారిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ముంబై పోలీసు అధికారులు మాళవిక అవినాష్‌ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

Chandika: “చండిక”ది కథ కాదు వ్యధ.. ఇలాంటి ఆత్మను ఇంకెక్కడా చూసి ఉండరు!

ఇంతలో మాళవిక స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తన ఆధార్ కార్డును సైబర్ మోసగాళ్లు దుర్వినియోగం చేశారని వెల్లడించారు. అంతేకాదు ట్రాయ్ నుంచి మాళవికకి నోటీసులు అందాయని అంటున్నారు. ఆమె పేరుతో ఉన్న సిమ్ కార్డు నుంచి ఇతరులకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వెళుతున్న క్రమ్మలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సంస్థ మాళవిక సిమ్ ని డీయాక్టివేట్ చేయడంతో మాళవిక ఆశ్చర్యపోయింది. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగా మాళవిక అవినాష్ ఆధార్ కార్డుతో ముంబైలో ఓ అజ్ఞాత వ్యక్తి సిమ్ వాడుతున్నట్లు తెలిసింది. ఆ అజ్ఞాత వ్యక్తే కొంతమందికి బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు తేలడంతో పోలీసులు ముంబైకి వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని తెలిపారు. అందుకు నిరాకరించిన మాళవిక వీడియో కాల్ ద్వారా ఫిర్యాదు చేశారు, ప్రజలంతా తమ ఆధార్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాళవిక ఒక వీడియో రిలీజ్ చేసి మరీ సూచించారు.