Site icon NTV Telugu

Bollywood : 51 ఏళ్ల వయసులో.. రెండో పెళ్లికి రెడీ అయిన హాట్ హీరోయిన్..!

Malaika Arora

Malaika Arora

బాలీవుడ్‌లో అందం, స్టైల్, ఫిట్‌నెస్‌కి సింబల్‌గా నిలిచిన మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల వయసు దాటిన, ఆమె గ్లామర్ & ఎనర్జీ ఇప్పటికీ యువ నటీమణులకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్‌తో ఆమెకి ఉన్న పాపులారిటీ వేరే లెవెల్‌లో ఉంటుంది. 1998లో విడుదలైన దిల్ సె చిత్రంలోని “చయ్యా చయ్యా” సాంగ్‌తో మలైకా ఒక్కరాత్రిలో స్టార్ అయింది. తర్వాత కాంటేలో “మహి వే”, దబాంగ్లో “మున్నీ బద్నామ్”, దబాంగ్ 2లో “పాండే జీ సీటీ” వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌లో తన డ్యాన్స్‌తో అలరించింది. తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో “కెవ్వు కేక” పాటతో బ్లాస్టింగ్ రెస్పాన్స్ అందుకుంది.

Also Read : Maareesan: ఫహాద్‌ ఫాజిల్‌ నటించిన కామెడీ థ్రిల్లర్‌.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

పర్సనల్ లైఫ్‌లో, మలైకా నటుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కానీ 2017లో వీరి దాంపత్య జీవితం విడాకుల‌తో ముగిసింది. ఆ తర్వాత ఆమె తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో లవ్ రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరూ వెకేష‌న్లు, ఈవెంట్లలో కపుల్ గోల్స్ సెటప్ చేసినా, తాజాగా వీరిద్దరూ బ్రేకప్ అయ్యారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇంతలోనే మలైకా కొత్తగా ఒక తాజా ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లిపై ఓపెన్ అయ్యారు. విడాకుల తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నానని, కానీ ఆ అనుభవ‌మే తనను మరింత బలంగా మార్చిందని చెప్పారు. “నేను హార్డ్‌కోర్ రొమాంటిక్‌ని.. ప్రేమను నమ్ముతాను. సరైన వ్యక్తి దొరికితే ఖచ్చితం‌గా రెండో పెళ్లి చేసుకుంటాను” అంటూ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఆమె ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి మలైకా జీవితంలో కొత్త చాప్టర్ ఎప్పుడు మొదలవుతుం‌దో చూడాలి.

Exit mobile version