ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఈ నెల 2న జరిగిన రోడ్డు యాక్సిడెంట్ నుండి లక్కీగా కొద్దిపాటి గాయాలతో బయటపడింది అందాల భామ మలైకా అరోరా. ఇటీవలే ఆమె హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది. దాంతో బాలీవుడ్ సెలబ్రిటీస్, ఆమె స్నేహితులు, సన్నిహితులు పరామర్శించడానికి క్యూ కట్టారు. ఇదిలా ఉంటే… యాక్సిడెంట్ అయిన తర్వాత మొదటి సారి ఆ సంఘటనపై ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించింది మలైకా అరోరా.
Read Also : Poonam Kaur : కాంగ్రెస్ ఎంపీని కలిసిన హీరోయిన్… పిక్స్ వైరల్
ఆనాటి నుండి ఇప్పటి వరకూ జరిగిన సంఘటన గురించి చెబుతూ, ”నాకు యాక్సిడెంట్ అయిన సంఘటన ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. అదేదో సినిమాలో జరిగినట్టుగా అయిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో నాతో పాటు ఉన్నవారు, నా చుట్టుపక్కల వారు ఎంతో సాయం చేశారు. నన్ను వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అక్కడి వైద్య సిబ్బంది సంపూర్ణ సహకారంతో నేను త్వరగా కోలుకోగలిగాను. ఇక స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, సోషల్ మీడియా ద్వారా అభిమానులు చూపించిన ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ ఎమోషనల్ అయ్యింది మలైకా. ‘తానో పోరాట యోధురాలినని, అతి త్వరలోనే తిరిగి జనం మధ్యకు వస్తాన’ని తెలిపింది. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ కొన్ని చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ చేసిన మలైకా ప్రస్తుతం రియాలిటీ షోస్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.
