Site icon NTV Telugu

Malaika Arora : 50 ఏళ్ల వయసులో మలైకా అందాల అరాచకం..

Malaika

Malaika

Malaika Arora : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా అరాచకం అంతా ఇంతా ఉండట్లేదు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు కుర్రాళ్లకు మెంటలెక్కిస్తుంటాయి. యాభై ఏళ్ల వయసులో కూడా తగ్గేదే లే అన్నట్టు అందాలను ఆరబోస్తూనే ఉంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసి పోని అందాలను మెయింటేన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కు ఆమె పెట్టింది పేరు. ఒకప్పుడు ఆమె ఐటెం సాంగ్స్ తో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఓ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది.

Read Also : Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..

కొన్నేళ్ల పాటు కలిసి తిరిగి ఎంజాయ్ చేశాక.. వీరిద్దరూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఇంత జరిగినా సరే ఆమె మాత్రం అందాలను ఆరబోయడం ఆపలేదు. తాజాగా మరోసారి హాట్ పిక్స్ ను షేర్ చేసింది. ఘాటు ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇందులో కత్తి లాంటి చూపులతో ఆమె చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఇంత ఘాటు అందాలను చూపించడం ఆమెకు కొత్తేం కాదు. ఎప్పుడూ ఇలాంటి అందాలను చూపిస్తూనే ఉంటుంది ఈ భామ. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరీ ఇంత ఘాటుగా చూపించడం ఏంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Exit mobile version