Site icon NTV Telugu

Vijay Sethupathi: కత్రినాతో కలిసి క్రిస్మస్ కి వస్తున్నాడు…

Merry Christmas

Merry Christmas

ప్రస్తుతం ఇండియాలో  మోస్ట్ వాంటెడ్ స్టార్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. కోలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్, మల్లువుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు-వెబ్ సీరీస్ లు చేస్తున్నాడు సేతుపతి. చిరు, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తూ కూడా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సేతుపతి ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘మెర్రి క్రిస్మస్’. 2022 డిసెంబర్ 25న విడుదల అవ్వాల్సిన ఈ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 2023 డిసెంబర్ 15న ‘మెర్రి క్రిస్మస్’ సినిమాని విడుదల చెయ్యనున్నారు, ఫైనల్ డేట్ ని లాక్ చేసి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు.

Read Also: Ram Charan Dog: చెల్లెలిపై ఓ కన్నేసి ఉంచా.. రామ్ చరణ్ కుక్క ఫొటో వైరల్!

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని శ్రీరామ్ రాఘవన్ రూపొందిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో శ్రీరామ్ రాఘవన్ దిట్ట, ఆయన డైరెక్ట్ చేసిన ‘అంధాదున్’ సినిమా నేషనల్ అవార్డ్ అందుకుంది. శ్రీరామ్ రాఘవన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే ఎదో కొత్త కథని చూడబోతున్నాం అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూనే ‘మెర్రి క్రిస్మస్’ పోస్టర్స్ కొత్తగా డిజైన్ చేసారు. మరి హిందీ తమిళ భాషల్లో 2023 డిసెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ మూవీ ఆడియన్స్ ని ఎంత థ్రిల్ చేస్తుందో చూడాలి.

Exit mobile version