NTV Telugu Site icon

Makkal Selvan: సేతుపతి ఉంటే సాలిడ్ కంటెంట్ ఉన్నట్లే…

Vijay Sethupathi Makkal Selvan

Vijay Sethupathi Makkal Selvan

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో సేతుపతి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. 46 ఏళ్ల సేతుపతి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన డైమండ్ లాంటోడు. ఎలాంటి పాత్రలో అయినా, ఏ భాష సినిమాలో అయినా నటించి మెప్పించగల సత్తా ఉన్న హీరో విజయ్ సేతుపతి. దుబాయ్ లో జాబ్ వదిలేసి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టిన విజయ్ సేతుపతి… ఇప్పుడు ఇండియాలో మోస్ట్ బిజీ యాక్టర్. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి హిందీ వరకూ ప్రతి చోట సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. ఇటీవలే బాలీవుడ్ లో కత్రినా కైఫ్ తో కలిసి మెర్రీ క్రిస్మస్ సినిమా చేసిన సేతుపతి థ్రిల్లింగ్ హిట్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత విజయ్ సేతుపతి అందుకున్న సోలో హిట్ ఇదే.

ఒక పక్క హీరోగా, ఇంకోపక్క సపోర్టింగ్ యాక్టర్ గా, మరోపక్క విలన్ గా నటించి అన్ని ఇమేజులని మ్యానేజ్ చేయడం విజయ్ సేతుపతికి మాత్రమే చెల్లింది. సేతుపతి ఒక సినిమాలో ఉన్నాడు అంటే అందులో మంచి కథ ఉంటుంది, సేతుపతి మంచి క్యారెక్టర్ చేసి ఉంటాడు అనే నమ్మకంలో ఆడియన్స్ ఉన్నారు అంటే ఒక యాక్టర్ గా సేతుపతి క్రెడిబిలిటీ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. విలన్ రోల్స్ లో కనిపించిన సేతుపతిని ఆడియన్స్ హీరో కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నారు, అది విజయ్ సేతుపతి గొప్పదనం. ఎంతటి స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ ఉండడం… కామ్ గా ఉండడం విజయ్ సేతుపతికి మాత్రమే చెల్లింది. అందుకే ఆయనకి ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తం ఉంది. ఇలాంటి బర్త్ డేస్ ని సేతుపతి మరిన్ని చేసుకోవాలని, మరిన్ని మంచి సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Show comments