నట సింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువగా చేసిన అనీల్ రావిపూడి డైరెక్షన్ లో మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే బాలయ్య నటిస్తున్నాడు అనగానే ఎలాంటి సినిమా చూడబోతున్నామో అనే ఆలోచన అందరిలోనూ మొదలయ్యింది. పర్ఫెక్ట్ బాలయ్య స్టైల్ లోనే ఉండే అనిల్ రావిపూడి సినిమా చూడబోతున్నాం అనే విషయం భగవంత్ కేసరి టీజర్ చూడగానే అందరికీ అర్ధం అయిపొయింది. అడవి బిడ్డ నెలకొండ భగవంత్ కేసరిగా బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ నందమూరి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు. టీజర్ కి థమన్ ఇచ్చిన మ్యూజిక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అనిల్ రావిపూడి, బాలయ్యని కొత్తగా చూపించి హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలోనూ కలిగింది.
ఈ దసరాకి సింహం తెలంగాణలో దిగుతుంది అంటూ అక్టోబర్ 19 రిలీజ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకూ భగవంత్ కేసరి నుంచి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాలేదు. మేకర్స్ కనీసం ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ ని చేయకపోవడం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. ఇదే సమయంలో దసరా రిలీజ్ నే టార్గెట్ చేస్తున్న టైగర్ నాగేశ్వర రావు, లియో సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వస్తూనే ఉంది. ఈ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ చాలా రెస్పాన్స్ ని రాబడుతూ సినిమాలపై అంచనాలని పెంచుతున్నాయి. సో అనిల్ రావిపూడి అండ్ టీం ఇప్పటికైనా భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తే, అక్టోబర్ 19 సమయానికి మంచి ఓపెనింగ్స్ ని రాబట్టే అవకాశం ఉంది.
