‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలూ తీవ్రంగా నిరాశపరిచాయి. కలెక్షన్ల పరంగా ‘సాహో’ పర్వాలేదనిపించినా, కంటెంట్ పరంగా మాత్రం విమర్శలు ఎదుర్కొంది. ఇక ‘రాధేశ్యామ్’ అయితే బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పతనమైంది. దీంతో.. ప్రభాస్ తదుపరి సినిమా అయిన ‘సలార్’ మీదే ఫ్యాన్స్ ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా కచ్ఛితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాబట్టి! కేజీఎఫ్‌తో ఆయన ‘మాస్’కి సరికొత్త నిర్వచనం ఇచ్చాడు కాబట్టి, ప్రభాస్‌తో చేస్తోన్న ‘సలార్’ అంతకుమించి ఉంటుందని అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకి తగినట్టుగానే ఈ సలార్ సినిమా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. ఆల్రెడీ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ.. మేకింగ్, బ్యాక్‌డ్రాప్ పరంగా ఈ చిత్రం సలార్ కంటే రెండు, మూడింతలు ఎక్కువగానే ఉంటుందని చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో ప్రశాంత్ నీల్ ఈ సినిమాని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిపాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా మేకర్స్ మరో మేజర్ అప్డేట్ ఇచ్చారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ వారు తమ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో, ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్‌తో ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్ గురించి చర్చించడాన్ని గమనించొచ్చు. ప్రశాంత్ నీల్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే, ఏదో పెద్ద యాక్షన్ సీక్వెన్స్‌నే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
కాగా.. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ సినిమా చిత్రీకరణ 25 నుంచి 30 శాతం వరకూ పూర్తయ్యిందని రీసెంట్‌గానే మేకర్స్ వెల్లడించారు. నవంబర్ కల్లా మిగిలిన షూట్ ముగుస్తుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.
Captain @prashanth_neel and Art director @shivakumarart preparing for an action sequence 🔥#Salaar #Prabhas @VKiragandur @hombalefilms @shrutihaasan @IamJagguBhai @RaviBasrur @bhuvangowda84 @SalaarTheSaga pic.twitter.com/Lf2mOM5963
— Salaar (@SalaarTheSaga) May 18, 2022