మెగాస్టార్ చిరంజీవి లైన్ లో పెట్టిన ఆసక్తికర చిత్రాల్లో “గాడ్ ఫాదర్” ఒకటి. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ మూవీ “లూసిఫర్” అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందుతోంది “గాడ్ ఫాదర్”. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించింది. సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న “గాడ్ ఫాదర్” చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తాజాగా ఈ సినిమా గురించి మేజర్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు.
Read Also : Shruti Haasan : నెట్ వర్త్ గురించి నెటిజన్ ప్రశ్న… ఏం చెప్పిందంటే ?
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. మోహన్ రాజా హీరోయిన్ నయనతారతో కలిసి ఓ మేజర్ షెడ్యూల్‌ను ఫినిష్ చేశాడు. నయనతారతో కలిసి ఉన్న ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డైరెక్టర్ “వరుసగా మూడోసారి ఆమెతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది” అంటూ రాసుకొచ్చారు. “గాడ్ ఫాదర్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న చిరంజీవి సెట్ లో చేరిన పిక్స్ కొన్ని వైరల్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు చిరు “భోళా శంకర్” సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
