Site icon NTV Telugu

Major: ‘ఓహ్ ఇషా.. ఈ మాయ ఏమిటోయి’ అంటున్న అడివి శేష్!

Major

Major

 

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జూన్ 3న విడుదల కాబోతోంది. ఇటీవల ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు దర్శక నిర్మాతలు అందులో భాగంగా బుధవారం సాయంత్రం ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘ఓహ్ ఇషా’ అనే పాట రిలికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఒక గెట్ టు గెదర్ లో ఆర్మీ అధికారులు తమ లైఫ్ పార్ట్నర్స్ తో డ్యాన్స్ చేస్తున్నపుడు మేజర్ సందీప్ గా శేష్ తన తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాట మొదలైయింది.

కాలేజీ డేస్ ప్రేమలో వుండే అందం, అమాయకత్వం ఈ పాటలో లవ్లీగా ప్రజంట్ చేశారు. 90’లో యంగ్ సందీప్ ఫస్ట్ లవ్ ని ఈ పాటలో అందంగా చూపించారు. సందీప్ కాలేజీ డేస్ లోని జ్ఞాపకాలని, లవ్లీ మూమెంట్స్ ని ఆహ్లాదకరంగా చిత్రీకరించారు. ఈ పాటలో శేష్, సాయి మంజ్రేకర్ జోడి క్యూట్ గా ఉంది. శేష్ కాలేజీ స్టూడెంట్ లానే మేకోవర్ అవ్వడం బాగుంది. ‘హాయి హాయి హాయి… ఈ మాయ ఏమిటోయి… గుండె ఆగి ఆగి ఎగురుతున్నది… చిక్కులన్నీ కూర్చి ఓ లెక్కలేవో నేర్చి… అంకెలాటలేవో ఆడుతున్నది’ అంటూ సాగే ఈ పాటకు శ్రీచరణ్‌ పాకల స్వరాలు సమకూర్చగా, రాజీవ్ భరద్వాజ్ సాహిత్యం అందించారు. ఈ మెలోడీ గీతాన్ని అర్మాన్ మాలిక్, చిన్మయి శ్రీపాద గానం చేశారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించాయి.

Exit mobile version