టాలీవుడ్ లో ఇటీవల పెయిడ్ ప్రీమియర్స్ హంగామా ఎక్కువగా ఉంది. కంటెంట్ మీద నమ్మకంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలా వేసి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, ప్లాప్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది.
Also Read : HIT 3 Teaser : మోస్ట్ వైలెంట్ గా ‘అర్జున్ సర్కార్’ లాఠీ ఛార్జ్
మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది మజాకా. అయితే రిలీజ్ కంటే ముందు ఒక్కరోజు ఈ సినిమాకు పైడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్నీ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఇక్కడెక్కడ ఈ షోస్ ఉంటాయి అనేది మాత్రం వెల్లడించలేదు. మేకర్స్ ఈ శివరాత్రి రోజు నవ్వులతో జాగారం చూపిస్తామని ముందు నుండి చెప్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పట్ల చిత్ర హీరో సందీప్ కిషన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సందీప్ కిషన్ ప్రీవియస్ సినిమా ఊరుపేరు భైరవకోన క్లోసింగ్కలెక్షన్స్ ను మొదటి వీకెండ్ నాటికీ మజాకా దాటేస్తుందని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించాడు. కెరీర్ లో హయ్యెస్ట్ వసూళ్లు రాబడుతుందనికాన్ఫిడెంట్ గా చెప్పాడు. మరి ముందు రోజు వేయనున్న ప్రీమియర్స్ తో హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబడుతుందో లేదో వెయిట్ అండ్ వాచ్