Mahi V Raghav : మినీ స్టూడియోకి స్థలం కేటాయింపు.. యాత్ర 2 డైరెక్టర్ ఘాటు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahi V Raghav Strong Counter against Allegations on Mini Studio Land Allocation: మహి వి.రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా చేసినందుకు మదనపల్లిలోని హర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్రభుత్వం… మహి వి.రాఘవ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెకరాలు భూమి ఇచ్చిందంటూ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విమర్శలు వినిపిస్తున్న క్రమంలో దర్శక నిర్మాత మహి వి.రాఘవ్ స్పందించారు. నిజంగా తనకు.. తన ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశ లేకపోతే, నేను హైదరాబాద్‌లోనో, వైజాగ్‌లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడుగుతా కానీ వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటా అని ప్రశ్నించారు. తానొక రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఇండస్ట్రీలో 16 ఏళ్లుగా ఉంటున్నానని, 2008లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టానని అన్నారు. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థలను స్థాపించా నిర్మాతగా, దర్శకుడిగా అందరికీ సుపరిచితుడినే. విలేజ్‌లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ, పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర, సిద్ధా లోకం ఎలా ఉంది?, యాత్ర 2 సినిమాలను .. అలాగే సేవ్ ది టైగర్స్, సైతాన్ అనే వెబ్ సిరీస్‌లను రూపొందించానని అన్నారు. నేను రాయలసీమ ప్రాంతంలోని మదనపల్లిలోనే పుట్టి పెరిగా, అక్కడే చదివా, సినీ పరిశ్రమలో రాయలసీమ ప్రాంతానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అక్కడ షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరని అన్నారు. నా ప్రాజెక్ట్స్‌లో ఆనందో బ్రహ్మ, సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్‌లను రాయలసీమలో తెరకెక్కించలేదు. పాఠశాల, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ రాయలసీమలోనే చిత్రీకరించా, మరీ ముఖ్యంగా ఈ రెండేళ్లలో సైతాన్, యాత్ర 2, సిద్ధాలోకం అనే మూడు ప్రాజెక్ట్స్‌ను మదనపల్లి, కడప ప్రాంతాల్లో రూపొందించామని అన్నారు.
Siren: ఫిబ్రవరి 23న తెలుగులో జయం రవి ‘సైరన్’
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
ఈ మూడు ప్రాజెక్ట్స్‌కి దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయలను ఖర్చు చేశా, అందుకు కారణం నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశమేనన్నారు. అందు కోసమే నేను సంపాదించిన డబ్బు అక్కడ ఖర్చు పెట్టా, అక్కడ సినిమాలు చేయటం వల్ల లాడ్జీలు, హోటల్స్, భోజనాలు, జూనియర్స్ ఇలా పలు రకాలుగా స్థానికులు ఉపయోగం ఉంటుందని భావించానని అన్నారు. ఈ జర్నీలో నేను వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా, అందువల్ల లోకల్ జనాలకు ఉపయోగంగా ఉంటుందని ఆలోచించానని అన్నారు. నేనేమీ స్టూడియో నిర్మాణం కోసం యాబై, వంద ఎకరాలు అడగలేదు, నేను కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా, దాని వల్ల అక్కడెవరైనా షూటింగ్స్ చేసుకోవాలనుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, అందరికీ ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి బుద్ధి ఉన్నోడెవడైనా దీన్ని ఆలోచించాలని అన్నారు. అందులో తప్పేముంది.. చేయనివారు ఎలాగూ చేయరు. ఇన్నేళ్లు ఇండస్ట్రీ ఉంటుంది కదా, రాయలసీమకు ఎవడైనా ఏమైనా చేశారా! ఎవరూ ఏమీ చేయలేదు, మీరు చేయరు… చేసేవాడిని చెయ్యనియ్యరని అన్నారు. ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించలేదని, వాళ్లకి ప్రియమైన ప్రభుత్వం ఎవరెవరికీ భూములను ఎక్కడెక్కడిచ్చింది? వాళ్లకు నచ్చినవాళ్లకు, ఇష్టమైన వాళ్లకు భూములను ఇచ్చుకుంది? వీటి గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. నేను నా ప్రాంతంలో కేవలం రెండు ఎకరాల్లో, అక్కడి ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.
- Tags
- Mahi V Raghav
- Yatra
- Yatra 2
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!