Site icon NTV Telugu

Mahi V Raghav: సీజన్ 2పై ఒత్తిడి.. అయినా అందుకే సూపర్బ్ రెస్పాన్స్!

Mahi V Raghav

Mahi V Raghav

Mahi V Raghav Comments on Save the Tigers 2 Sucess: డైరెక్టర్ మహి వి.రాఘవ్ షో రన్నర్ గా రూపొందించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఈ వెబ్ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 1 బ్లాక్ బస్టర్, తర్వాత ‘సైతాన్’ సూపర్ హిట్ అయింది, ఇక ఇప్పుడు ‘సేవ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే యాత్ర 2 కి కూడా మంచి సినిమా అంటే టాక్ వచ్చింది. దీంతో మహి వి.రాఘవ్ హ్యాట్రిక్ హిట్స్ సాధించి టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రైటర్, నిర్మాత, దర్శకుడిగా ఇప్పటికే తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు మహి. తన త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై డైరెక్టర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తూనే షో రన్నర్‌గానూ వెబ్ సిరీస్‌లను కూడా రూపొందిస్తూ షో రన్నర్‌గా సూపర్ హిట్స్‌ను అందించారు. ఇక తాజాగా ఈ విజయాల గురించి స్పందించారు ‘‘ఇంత మంచి విజయాలను అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రతి రోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్ ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశామని అన్నారు.

Priyanka Jain: చిరుత ఎటాక్ చేసిందంటూ వీడియో పోస్ట్ చేసిన నటి.. ఇదేం పైత్యం ప్రియాంకా?

నటీనటులు అద్భుతంగా నటించారు, దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చిందన్నారు. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి ప్రయత్నిస్తా, అలా చేశా కాబట్టే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందన్నారు మహి.వి.రాఘవ్. సేవ్ ది టైగర్స్ సీజన్ 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే, సీజన్ 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశామని అన్నారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 1 చాలా పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్ 2పై ఒత్తిడిగా ఫీలయ్యా, ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరమన్నారు. అందుకే మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం, అలాగే సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాం అని అన్నారు. మా బ్యానర్‌కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటామని అన్నారు. త్వరలోనే మరికొన్ని వెబ్ షోలను రూపొందించటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు మహి.వి.రాఘవ్.

Exit mobile version