సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో సినిమాకు మాత్రమే సంబంధించి కాకుండా ఇతర కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఒక ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. “మై ఓ మూమెంట్” అనే లైఫ్ స్టైల్ క్లబ్ ను లాంచ్ చేశారు. అందులో ఫిట్ నెస్, న్యూట్రిషన్, ఫీజియోథెరపీ వంటి సేవలను అందించనున్నారు. “ఫిట్‌నెస్ కోసం నా అన్వేషణలో ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షకులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. గాబ్రియేల్ మినాష్ ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఫిట్‌నెస్, న్యూట్రిషన్, ఫిజియోథెరపీ, రికవరీని అందించే లైఫ్‌స్టైల్ క్లబ్ #MyoMovement ను ప్రారంభించడం సంతోషంగా ఉంది” అంతో మహేష్ బాబు ట్వీట్ చేశారు.
Read Also : మా ఎన్నికలు.. బాబుమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. జనవరి 13న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. కాగా రెండ్రోజుల క్రితం మహేష్ బాబును కాంగ్రెస్ మాజీ ఎంపీ శశి థరూర్ “సర్కారు వారి పాట” షూటింగ్ సెట్లో కలిసిన విషయం విదితమే.
