Mahesh Fans in tension due to Sree leela: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే విచిత్రమో తెలియదు కానీ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది. ముందుగా కథ మార్చాలని అనుకుని కొంత షూటింగ్ లేట్ చేయగా తర్వాత మహేష్ బాబు తల్లి తండ్రి చనిపోవడం ఆ తర్వాత ఆర్టిస్టుల డేట్స్ క్లాష్ అవ్వడంతో మా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టాలంటే పూజా హెగ్డే డేట్లు క్లాష్ అవుతున్న నేపథ్యంలో ఆమెను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థానంలో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ అవబోతోంది. అయితే ఇదే విషయంలో ఇప్పుడు మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకపక్క వారు ఆనంద పడుతున్నా మరోపక్క మాత్రం టెన్షన్ తొలిచేస్తోంది అని అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే శ్రీ లీల చేస్తున్న అన్ని సినిమాలు కలిసి వస్తున్నాయి.
Rashmika Mandanna: మేనేజర్ దెబ్బకి రష్మిక కీలక నిర్ణయం.. ఇక ఒంటరిగానే?
దాదాపుగా ఆమె చేస్తున్న అన్ని సినిమాలతో హిట్ల అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏ సినిమా కూడా హిట్ అవుతుందని మహేష్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కానీ డాన్స్ విషయంలోనే భయపడుతున్నారు శ్రీల డాన్స్ విషయంలో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా ఆమె పెళ్లి సందd, ధమాకా వంటి సినిమాల్లో చేసిన డాన్స్ మూమెంట్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. రవితేజ కాబట్టి ఆమె ఎనర్జీతో మ్యాచ్ అయ్యేలా పల్సర్ బైక్ సాంగ్ లో మెరిపించాడు కానీ మహేష్ బాబు ఆమె ఎనర్జీతో మ్యాచ్ అవ్వగలడా లేక ఆమె ఎనర్జీ మహేష్ బాబుని డామినేట్ చేస్తున్నదా? అనే విషయం మీద ఇప్పుడు మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇండస్ట్రీలో బన్నీ జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలతో పోలిస్తే మహేష్ బాబు డాన్స్ విషయంలో కొంత వెనకబడి ఉంటాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మహేష్ మీద ఆమె డామినేషన్ కనిపిస్తుందేమో అని మహేష్ అభిమానులు అయితే టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన రాక పోవడంతో అసలు నిజంగానే పూజా హెగ్డే తప్పుకున్నదా? లేక ఇదంతా ప్రచారమేనా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.
Guntur Kaaram: శ్రీలీల మెయిన్ హీరోయినా? మహేష్ ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్!
Show comments