Mahesh Fans: బాక్సాఫీస్ ని గుద్ది పారేసారు… ఓ వంశీ వంద కోట్ల షేర్ పోస్టర్ దించు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహర్షి సినిమాకి 3 రేటింగ్ ఇచ్చారు, సరిలేరు నీకెవ్వరు సినిమాకి కూడా దాదాపు 3 రేటింగే వచ్చింది, సర్కారు వారి పాట సినిమాకి 2.5 వరకూ రేటింగ్ ఇచ్చారు. క్రిటిక్స్ ఇచ్చిన ఈ రేటింగ్స్ ని పక్కన పెడితే మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాయి. యావరేజ్ రివ్యూస్, హాఫ్ బేక్డ్ ప్రాజెక్ట్స్ అనే ఒపీనియన్స్ ని సొంతం చేసుకున్న ఈ మూడు సినిమాలు కలిపి మహేష్ బాబు దాదాపు 650 కోట్లని కలెక్ట్ చేసాడు. ఇది యావరేజ్ కాదు రీజనల్ సినిమాల్లో రికార్డ్ అనే చెప్పాలి. ఈ 650 కోట్లు కల్పించి చెప్తున్న లెక్కలు కాదు ట్రేడ్ నుంచి అఫీషియల్ గా వచ్చిన నంబర్స్… మేకర్స్ పోస్టర్స్ పై వేసిన కలెక్షన్స్. మహేష్ బాబు బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అనే మాటని నిజం చేస్తూ… ఇప్పుడు గుంటూరు కారం సినిమా కూడా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబడుతోంది. మూడు రోజుల్లో 167 కోట్ల గ్రాస్ ని రాబట్టిన గుంటూరు కారం సినిమాని క్రిటిక్స్ నుంచి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. 70 వేల మంది గుంటూరు కారం సినిమాకి, సినిమా చూడకుండానే నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది అంటే గుంటూరు కారం సినిమాపై ఎంత నెగటివిటీ స్ప్రెడ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ నెగిటివిటీని లెక్క చేయకుండా మహేష్ ఫ్యాన్స్ అండ్ న్యూట్రల్ ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం సినిమాని నిలబెడుతున్నారు. సంక్రాంతి పండగ రోజు కూడా గుంటూరు కారం సినిమాకి ఈవెనింగ్ అండ్ నైట్ షోస్ ఫుల్ అయ్యాయి. దీంతో ఈరోజు 200 కోట్ల గ్రాస్ వంద కోట్ల షేర్ పోస్టర్ ప్రొడ్యూసర్స్ నుంచి బయటకి వచ్చే అవకాశం ఉంది. 95-100 కోట్ల షేర్ ని నెగటివ్ టాక్ తో రాబట్టడం అనేది అంత ఈజీ విషయం కాదు. మహేష్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా నిలబడి గుంటూరు కారం సినిమాని బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు తీసుకోని వెళ్తున్నారు. ఇప్పటికే 69-70% బిజినెస్ రికవరీ చేసిన గుంటూరు కారం సినిమా మరో 33-35 కోట్లని కలెక్ట్ చేస్తే చాలు బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయినట్లే. ఈరోజు కనుమ పండగ కాబట్టి గుంటూరు కారం సినిమా మళ్లీ ఈవెనింగ్ అండ్ నైట్ షోస్ ని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయనుంది.
Also Read
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..