NTV Telugu Site icon

SSMB 28: పాన్ ఇండియా సినిమా… క్లారిటీ ఇచ్చిన ఒటీటీ దిగ్గజం

Ssmb 28

Ssmb 28

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైన ఉంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుండగా, ఇదో పాన్ ఇండియా సినిమా అంటూ ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రివీల్ చేసింది. ప్రస్తుతం తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ పై దృష్టి పెట్టిన నెట్ ఫ్లిక్స్, SSMB 28 రైట్స్ కూడా మేమే తీసుకున్నాం అని అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. పెను తుఫాన్ తలోంచైనా చూడడనికి మేము రెడీ, మీరు రెడీనా? అంటూ నెట్ ఫ్లిక్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. థియేట్రికల్ రన్ అయిపోయిన తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో SSMB 28 సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.

నెట్ ఫ్లిక్స్ చేసిన ఈ అనౌన్స్మెంట్ తో SSMB 28 సినిమా పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతుంది అనే విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే ఏ భాష సినిమాకి అయినా ఒటీటీలో డబ్బింగ్ వర్షన్స్ ఉంటాయి, అలానే SSMB 28 కూడా ఇతర భాషల్లో డబ్బింగ్ వెర్షన్ ఉంటుందేమో అనే అనుమానం కూడా కొందరిలో ఉంది. ఒకవేళ మహేశ్, త్రివిక్రమ్ లు కలిసి ‘SSMB28’ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మలిస్తే, అది మహేశ్ ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. నిజానికి మహేశ్, రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ సినిమా చెయ్యాల్సి ఉంది. రాజమౌళి మూవీతోనే మహేశ్ బౌండరీలు దాటాలి అనుకున్నాడు, మరి ఆ ఆలోచన మార్చుకోని మరీ మహేశ్ SSMB28 సినిమాతో పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తున్నాడు అంటే త్రివిక్రమ్ కథలో ఎంతో విషయం ఉండి ఉండాలి. మరి మహేశ్ ని ఆ రేంజులో మెప్పించిన ఆ కథ ఏంటో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments