Sarkaru Vaari Paata మూవీ అప్డేట్స్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “సర్కారు వారి పాట” మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో దుమ్మురేపాయి. ‘కళావతి’తో పాటు ‘పెన్నీ’ సాంగ్ కూడా మహేష్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు షూటింగ్ పార్ట్ పూర్తయినట్టు సమాచారం.
Read Also : NBK107 : బిగ్ అప్డేట్… గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్
ఎట్టకేలకు Sarkaru Vaari Paata షూటింగ్ లో తన పార్ట్ పూర్తవ్వడంతో మహేష్ బాబు రెస్ట్ తీసుకోబోతున్నాడట. తన తన నెక్స్ట్ మూవీకి దాదాపు రెండు నెలల లాంగ్ గ్యాప్ తీసుకోనున్నాడని తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే తన నెక్స్ట్ సినిమాకు దొరికిన గ్యాప్ లో మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ను ప్లాన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు Sarkaru Vaari Paata విడుదలై, ఆ సినిమా రిజల్ట్ కూడా తేలిపోనుంది. రెండు నెలల తరువాత మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీని ఫ్రెష్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలు పెట్టనున్నారు. వీలైనంత తొందరగా ఈ మూవీని పూర్తి చేసి, ఆ తరువాత రాజమౌళి సినిమాపై దృష్టి పెట్టనున్నారు మహేష్ బాబు.
