సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మే 12న థియేటర్లలోకి రానుంది. ఇక సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేసేముందు మహేష్ ఫ్యామిలీ తో కలిసి చిన్నపాటి వెకేషన్ ను ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మహేష్ బాబు ప్రస్తుతం తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి ప్యారిస్‌లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Read Also : Rashmika : బ్యూటీ సీక్రెట్ రివీల్… ఇవే తింటుందట నేషనల్ క్రష్ !
దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం వహించిన ‘సర్కారు వారి పాట’తో తిరిగి తెరపైకి సందడి చేయబోతున్నారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. మహేష్ బాబు కూతురు సితార కూడా ఈ సినిమాలోని ‘పెన్నీ’ పాటతో వెండితెర అరంగేట్రం చేస్తోంది.