మహేష్ బాబు సూపర్ స్టార్ క్రేజ్ కు తగ్గట్టుగానే ఆయన కెరీర్ లో కొన్ని అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఆ జాబితాలో “దూకుడు” ఒకటి. ఈ చిత్రం 23 సెప్టెంబర్ 2011 న 1800 స్క్రీన్‌లపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, సోనూ సూద్ తో పాటు బ్రహ్మానందంప్రధాన పాత్రల్లో నటించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర దీనిని సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం సినిమాకు మరో హైలెట్.
Read Also : బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ్ – లహరి పెళ్ళైపోయింది!
సినిమా షూటింగ్ హైదరాబాద్ మొదలుకొని ముంబై, గుజరాత్, ఇస్తాంబుల్, దుబాయ్, స్విట్జర్లాండ్, టర్కీ లాంటిప్ ప్రాంతాలలో జరిగింది. 35 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం 57.4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్, 101 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మహేష్ కెరీర్ లోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా “దూకుడు” చూపించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు ఏడు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది.
మహేష్ బాబు కెరీర్ లో పాత్ బ్రేకింగ్ మూవీ, టాలీవుడ్ లోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన మూవీ, రికార్డు స్థాయిలో మొదటి వారాంతపు కలెక్షన్లను రాబట్టిన మూవీ, తొలి మిలియన్ డాలర్ల తెలుగు సినిమా. 101 కోట్లు కొల్లగొట్టిన ఇండస్ట్రీ హిట్ మూవీగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో స్థానం సంపాదించుకుంది “దూకుడు”. ఇక ఈ సినిమా విడుదలై పదేళ్లయినా సందర్భంగా మరోసారి ఆంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో “దూకుడు” రిలీజ్ చేశారు.
