Site icon NTV Telugu

Mahesh Babu : ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ.. ఏమన్నాడంటే..?

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈడీ అధికారులకు లేఖ రాశారు. తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ అందులో తెలిపారు. సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఇప్పటికే మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28న విచారఖు రావాలంటూ తెలిపారు. తాను రేపు విచారణకు హాజరు కాలేనని మహేశ్ బాబు తాజాగా లేఖ రాశారు. విచారణ కోసం మరో డేట్ ను ఫిక్స్ చేయాలని కోరారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సాయి సూర్య డెవలపర్ సంస్థలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ సంస్థ ఒకే ఫ్లాట్ ను పది మందికి అమ్మారని.. అలా కస్టమర్ల దగ్గరి నుంచి రూ.100 కోట్ల దాకా అక్రమంగా వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు.
Read Also : Priyadarshi : ప్రియదర్శికి పెరుగుతున్న మార్కెట్.. కమెడియన్ గా మానేస్తాడా..?

ఈ సంస్థకు మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ప్రమోట్ చేశారు. ఇందుకోసం మహేశ్ బాబు రూ.5.9 కోట్లు తీసుకున్నారు. ఇందులో 3.9 కోట్ల రూపాయలను చెక్కు రూపంలో తీసుకొని రెండు కోట్ల రూపాయలను తీసుకున్నారు మహేష్ బాబు. దీంతో మహేశ్ బాబును కూడా విచారణకు రావాలంటూ అధికారులు ఆదేశించారు. మహేశ్ బాబు ప్రమోట్ చేయడంతో వందలాది మంది ఈ సాయిసూర్య డెవలపర్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. కానీ సంస్థ వ్యవహార శైలిపై అనుమానాలు రావడంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు. కానీ అప్పటికే కస్టమర్లు వందల కోట్లు పెట్టుబడులు పెట్టేశారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఇందులో మహేశ్ పాత్ర ఎంత ఉందనేది విచారణలో తేలిపోనుంది.

Exit mobile version