Site icon NTV Telugu

Pahalgam Terror Attack : క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం.. మహేశ్ బాబు, విజయ్..

Terror Attack

Terror Attack

Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం దాడిపై దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటన దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఈ క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా మనం స్టాండ్ తీసుకోవాలి. ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి. ఈ క్లిష్ట సమయంలో వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు.

Read Also : Harihara Veeramallu: బరిలోకి దిగిన పవన్ కల్యాణ్..!

విజయ్ దేవరకొండ కూడా తన బర్త్ డేను రెండేళ్ల క్రితం పమల్గాంలో సెలబ్రేట్ చేసుకున్నానని చెప్పారు. అక్కడి ప్రజలు తనను ఎంతో బాగా చూసుకున్నారని.. అలాంటి చోట హృదయ విదారకర ఘటన జరగడం కలిచివేసిందన్నారు. టూరిస్టుల మీద టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. బాధితుల తరఫున నిలబడుదామన్నారు. ఇండియా ఎప్పటికీ తలవంచదని.. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నిలబడుదాం అంటూ తెలిపారు. ఇదే ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, జాన్వీకపూర్ కూడా స్పందించారు.

Exit mobile version