Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏదైనా ఆయనకు నచ్చితే.. ఆ చిత్ర బృందాన్ని ప్రశంసించడంలో ఏ మాత్రం మొహమాటపడడు. చిన్నా, పెద్ద, స్టార్స్, కొత్తవారు అని తేడా లేకుండా సినిమాను వీక్షించి ట్విట్టర్ లో తనదైన రీతిలో రివ్యూ చెప్పుకొచ్చేస్తాడు. మహేష్ లో ఉన్న మంచి లక్షణాల్లో ఇది ఒకటి. ఇది అనే కాదు.. బర్త్ డేస్ కానీ, స్పెషల్ అకేషన్స్ కానీ.. ఏదైనా గుర్తుపెట్టుకొని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా మహేష్ బాబు.. దసరా సినిమాపై ప్రశంసలు కురిపించాడు. న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం నిన్న రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తోంది. న్యాచురల్ స్టార్ నానిని టైర్ 2 హీరో నుంచి టైర్ 1 హీరోగా నిలబెట్టిన సినిమా అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.
Mahesh Babu: అన్నా.. ఇలా చేయడం నీకు కొంచమైనా న్యాయంగా అనిపిస్తుందా..?
ఇక ఈ నేపథ్యంలోనే దసరా సినిమాపై మహేష్ బాబు ఇచ్చిన రివ్యూ మరింత హైప్ ను పెంచేస్తోంది. “దసరా.. చాలా చాలా గర్వంగా ఉంది.. అద్భుతమైన సినిమా అంటూ చివర్లో ఫైర్ ఎమోజీలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై నాని ఫ్యాన్స్ కలర్ ఎగరేస్తున్నారు. మహేష్ అన్నే స్టన్నింగ్ అంటే.. ఇక సినిమాకు తిరుగులేదు. కలక్షన్స్ అదరగొట్టేస్తాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఇంకే హీరోలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తారో చూడాలి.
So so proud of #Dasara!! Stunning cinema! 🔥🔥@NameisNani @KeerthyOfficial @Dheekshiths @thondankani @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP
— Mahesh Babu (@urstrulyMahesh) March 31, 2023
