Mahesh Babu tip to Control Wife at Animal Pre Release Event: పెళ్లాన్ని కంట్రోల్లో పెట్టడం మస్తు తెలుసు అని వరుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమాలో డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సూట్ అవుతుందని అంటున్నారు నెటిజన్స్. దానికి కారణం నిన్న (నవంబర్ 27న) మల్లారెడ్డి ఇంజినీరింగ్ గ్రౌండ్స్ కళాశాలలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు గెస్టుగా హాజరైన మహేశ్ ఆ ఫంక్షన్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఫంక్షన్ కు యాంకరింగ్ సుమ చేసింది. ఇక ఎప్పటిలాగానే సుమ తన ఫన్నీ క్వశ్చన్స్ తో స్టేజీమీద హంగామా చేసింది. ఇక మహేశ్ బాబును కృష్ణ గారు మిమ్మల్ని కోప్పడిన సందర్భం ఒకటి చెప్పండి అంటూ సుమ.. మహేశ్ బాబును అడిగింది.
Google Search Safety Tips : గూగుల్ సెర్చ్‌లో వచ్చిన ఈ విషయాలను నమ్మితే అంతే!
దీనికి ఆయన బదులిస్తూ… అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమాలో చూపించినంత ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అయితే నేను చూడలేదంటూ చెప్పుకువచ్చాడు మహేశ్. ఆ తరువాత భర్తలు భార్యలను ఎలా మ్యానేజ్ చేయాలి అనే విషయంలో ఏమైనా టిప్స్ ఇస్తారా అంటూ సుమ మహేశ్ బాబును అడిగింది. దానికి మహేశ్ బాబు… భర్తలు ఎప్పుడు నవ్వుతూ ఉంటే చాలు…. అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇక ఏ సందర్భం అయినా నవ్వుతూ ఉండండి… మ్యానేజ్ చేయడానికి అదొక్కటే దారి అంటూ వెల్లడించారు. ఇక మహేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లాన్ని కంట్రోల్లో పెట్టాలంటే.. మహేశ్ బాబు భలే టిప్ ఇచ్చారంటూ నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు మాట్లాడిన ఈ వీడియోను ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఫైనల్ గా SSMB29 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అయినా అప్డేట్ ఇవ్వండి అంటూ సుమ అడగ్గా… ఆ సినిమాకి ఇంకా సమయం ఉందంటూ చెప్పుకువచ్చాడు మహేశ్.