Site icon NTV Telugu

Mahesh Babu: కీర్తి నన్ను తిడితే.. సితార పగలపడి నవ్వింది

Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శనివారం పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌, డైరెక్టర్‌ పరశురామ్‌ పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వారితో పంచుకోవాలని మహేశ్‌ బాబు తెలిపాడు.

ఇక మహేష్ మాట్లాడుతూ ” ఒక సీన్ లో కీర్తి నన్ను తిట్టాలి.. కానీ ఆమె తిట్టలేకపోతోంది. మూడు టేకులు అయిపోయాయి. కీర్తి భయపడకు నన్ను తిట్టు అని చెప్పాను. మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ ఊరుకోరు అండీ అని చెప్పింది. వారు ఏమి అనరు.. నేను చెప్తున్నా కదా.. తిట్టు పర్లేదు అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తయ్యేలా చేశాం. కానీ మొన్న నా ఫ్యామిలీతో కలిసి ఆ సీన్‌ చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్‌ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్వింది.. అని చెప్పుకొచ్చాడు మహేశ్‌బాబు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version