ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్ బాబు మాత్రమే కనిపిస్తున్నాడు. మరో రెండు రోజులో మహేష్ నటించిన సర్కారువారి పాట సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుండగా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్.. ఇక దీంతో వరుస ఇంటర్వ్యూలతో మహేష్ బిజీగా మారాడు. ఇక తాజగా మహేశ్ బాబు మీడయాతో ముచ్చటించారు. ఇక ఈ సందర్భంగా ఏపీ సమ్మె జగన్ గురించి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని నేరుగా కలిసినప్పుడు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఆయనతో అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడాను అంతేకానీ నేరుగా కలవలేదు. కానీ మొదటిసారి ఆయనను కలవడం చాలా ఆనందాన్నిచ్చింది.
ఆయన చాలా సింపుల్. అంత సింపుల్‌గా ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయా.. ఎదుటి వ్యక్తులకు మంచి గౌరవం ఇస్తారు. ఆయనతో చాలా విషయాలను చర్చించాం. సినిమాల గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి మీటింగ్ ఎప్పుడో జరిగి ఉంటే బాగుంటుందని నేను సలహా ఇచ్చాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మమల్ని రిసీవ్ చేసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది” అంటూ చెప్పు కొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
