Site icon NTV Telugu

చక్రసిద్ధ్ కేంద్రాన్ని ప్రారంభించిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతతో కలిసి హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి సమీపంలో మోకిల వద్ద చక్రసిధ్‌ అనే హెల్త్‌కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. శాంత బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, యాంకర్ సుమ రాజీవ్ కనకాల దంపతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. సిద్ధ వైద్యం ఒక అద్భుత చికిత్స, ప్రామాణికమైనది, ప్రాచీనమైనది మరియు సాంప్రదాయమైనది మరియు దీనిని ప్రోత్సహించడం నాకు సంతోషంగా ఉంది’ అని మహేష్ బాబు తెలిపారు. సిద్ద వైద్యంను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉందని నమ్రత తెలియజేశారు. డాక్టర్‌ సింధుజ మాట్లాడుతూ.. చక్రసిద్ధం నొప్పిలేని జీవితాన్ని గడపాలని కోరుకునే వారికి అనువైన ప్రదేశం అని డాక్టర్ భువనగిరి సత్య సింధుజ అన్నారు.

Exit mobile version