NTV Telugu Site icon

SSMB 28: ఓ త్రివిక్రమ్ మా అన్ననే వెయిట్ చేయిస్తావా?

Ssmb 28

Ssmb 28

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. గతమో రెండు సార్లు మిస్ అయిన హిట్ ని ఈసారి సాలిడ్ గా కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇటివలే రిలీజ్ అయిన మహేశ్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ జనవరి 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న SSMB 28 మూవీకి లీకుల బెడద తప్పట్లేదు. గతంలో మహేశ్ బాబు స్మోకింగ్ ఫోటో, మహేశ్ హెడ్ బ్యాండ్ కట్టుకున్న ఫోటో, ఒక చిన్న వీడియో లాంటివి SSMB 28 నుంచి లీక్ అయ్యాయి. ఇలాంటిదే లేటెస్ట్ గా మరో లీక్ బయటకి వచ్చింది, ఇందులో మహేశ్ బాబు, త్రివిక్రమ్, పూజా హెగ్డే ఉన్నారు. షాపింగ్ మాల్ లో చేస్తున్న షూటింగ్ నుంచి లీక్ అయిన ఈ ఫోటోలో మహేశ్ బాబు కూల్ అండ్ సింపుల్ గా ఉన్నాడు.

పూజా ట్రెడిషనల్ డ్రెస్ లో అందంగా కనిపిస్తోంది. మాములుగా ఏదైనా లీక్ బయటకి వస్తే ఫాన్స్ దాన్ని వైరల్ చేస్తారు కానీ ఈ లీక్ బయటకి వచ్చిన తర్వాత “ఓ త్రివిక్రమ్ మా అన్ననే వెయిట్ చేయిస్తావా? మా అన్న ఉండగా హీరోయిన్ తో మాట్లాడుతున్నావ్?” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పూజా హెగ్డేతో త్రివిక్రమ్ మాట్లాడుతూ ఉండడం, మహేశ్ పక్కకి చూస్తూ ఉండడంతో ఈ కామెంట్స్ మరింత ఫన్నీగా మారాయి. అయితే నిజానికి త్రివిక్రమ్, పూజా హెగ్డేకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు ఉన్నాడు. త్రివిక్రమ్ ఇమ్మిడియేట్ గా SSMB 28 లీకులు బయటకి రాకుండా చూసుకోవాలి లేదంటే ఫిల్మ్స్ నుంచి అఫీషియల్ గా వచ్చే అప్డేట్స్ పై ఇంటరెస్ట్ తగ్గే ప్రమాదం ఉంది.