NTV Telugu Site icon

Mahesh Babu: గుంటూరు ఫ్యాన్స్ కోసం మహేష్ స్పెషల్ పోస్ట్…

Mahesh Babu

Mahesh Babu

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాలతో మిస్ అయిన హిట్ ఈసారి ఇండస్ట్రీ హిట్ గా అందుకోవడానికి రెడీ అయిన మహేష్ అండ్ త్రివిక్రమ్… గుంటూరు కారం సినిమాని కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా మార్చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ పైన ఉన్న అంచనాలని ఫుల్ ఫిల్ చేసింది గుంటూరు కారం ట్రైలర్. జనవరి 12కి బాబు బాక్సాఫీస్ ర్యాంపేజ్ కి పెర్ఫెక్ గ్రౌండ్ రెడీ చేసిన ట్రైలర్, ఎక్స్పెక్టేషన్స్ బార్ ని మాత్రం చాలా హై కి తీసుకోని వెళ్ళింది. ట్రైలరే అనుకుంటే గుంటూరులో జరిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘట్టమనేని అభిమానుల్లో సాలిడ్ జోష్ తెచ్చింది. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా జరగడంతో మహేష్ అభిమానుల కోసం ఒక ట్వీట్ చేసాడు.

“థాంక్స్ గుంటూరు!! నా సొంత ఊరిలో అంతమంది మధ్యలో నా సినిమాని మీ ప్రేమాభిమానాలు మధ్య సెలబ్రేట్ చేసుకోవడం నాకు చిరకాలం ఒక మంచి జ్ఞాపకంలా హృదయానికి దగ్గరగా ఉండిపోతుంది. మీ అందరినీ మళ్లీ కలవాలి అనుకుంటున్నా… అతి త్వరలో!! సంక్రాంతి మొదలయ్యింది! #గుంటూరు కారం సినిమా ఈవెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చూసుకున్న గుంటూరు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారి సపోర్ట్ కి చాలా థాంక్స్” అని అర్ధం వచ్చేలా మహేష్ బాబు స్పెషల్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ లో ఉన్న ఫోటోని ఘట్టమనేని అభిమానులు వైరల్ చేస్తున్నారు. మరి మరో 48 గంటల్లో ఆడియన్స్ ముందుకి రానున్న గుంటూరు కారం సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుంది? కలెక్షన్స్ కి ఎలాంటి బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనేది చూడాలి.