NTV Telugu Site icon

Gautam Ghattamaneni: మహేష్ కొడుకా.. మజాకానా.. నెక్స్ట్ సూపర్ స్టార్ బాబునే

Gautam

Gautam

Gautam Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటూ తండ్రి గురించి ముచ్చట్లు చెప్పుకొంటూ వస్తోంది. అయితే మహేష్ కుమారుడు గౌతమ్ మాత్రం కొద్దిగా నెమ్మది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఎప్పుడో తండ్రితో తప్ప బయట కనిపించడు. ప్రస్తుతం గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా స్కూల్ లో జరిగిన ఒక ప్రోగ్రామ్ లో గౌతమ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. థియేటర్ ప్రొడక్షన్ లో ఒక స్కిట్ చేస్తూ కనిపించాడు. వన్ నేనొక్కడినే సినిమాలో కెమెరా ముందు నటించిన గౌతమ్ ఇన్నాళ్ల తరువాత ఇదుగో ఇలా స్టేజిపై కనిపించాడు. లవ్ స్టోరీలా సాగిన ఈ కథలో గౌతమ్ ప్రధాన పాత్ర చేస్తున్నట్లు కనిపించాడు.

ఇంగ్లిష్ లో డైలాగులు అదరగొట్టడమే కాకుండా హావభావాలను చక్కగా పలికించాడు. ఈ వీడియోను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొడుకు గురించి మురిపెంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన మహేష్ ఫ్యాన్స్ మహేష్ కొడుకా.. మజాకానా.. కాబోయే సూపర్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అభిమానులు అనడమే కాదు.. మహేష్ కు జిరాక్స్ కాపీలా మారిపోయాడు గౌతమ్. చూడచక్కని రూపం. ఇప్పుడిప్పుడే అభినయం నేర్చుకుంటున్నాడు. త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా అభిమానులు ఆదరిస్తారు అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి సూపర్ స్టార్ మహేష్, కొడుకు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడో చూడాలి.