Site icon NTV Telugu

Mahesh Babu : సితార ఫస్ట్ కూచిపూడి డ్యాన్స్… వీడియోతో మహేష్ శ్రీరామ నవమి విషెస్

Mahesh Babu

Mahesh Babu

నేడు దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి సెలెబ్రేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి శ్రీరామ నవమి విషెస్ తో స్పెషల్ ట్వీట్ చేయగా, తాజాగా మహేష్ బాబు తన గారాలపట్టి సితార కూచిపూడి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

Read Also : Hari Hara Veera Mallu : సెట్లో శ్రీరామ నవమి… పిక్స్ వైరల్ 

“సితార మొట్టమొదటి కూచిపూడి నృత్య పఠనం… ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఈ శ్లోకం శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తుంది! నా సీతూ పాపా క్రాఫ్ట్ పట్ల నీకున్న అంకితభావం నాకు విస్మయం కలిగిస్తోంది! మీరు నన్ను మరింత గర్వించేలా చేసారు! నీకు అపారమైన గౌరవం, ప్రేమ లభించాలని కోరుకుంటున్నాను. ఈ అందమైన నృత్యాన్ని సీతారాకు నేర్పించినందుకు అరుణ భిక్షు గారు, మహతీ భిక్షు గారికి ధన్యవాదాలు. మీ అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. మీ రోజు ప్రకాశవంతంగా, ప్రేమ, కాంతితో నిండి ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ మహేష్ బాబు వరుస ట్వీట్లు చేశారు. ఇక సితార విషయానికొస్తే సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. ఇప్పటికే సితార “సర్కారు వారి [పాట”లోని “పెన్నీ” సాంగ్ లో తన డ్యాన్స్ తో మ్యాజిక్ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version