NTV Telugu Site icon

Mahesh Babu: ఆరోజు రీజనల్ సినిమాల్లో కొత్త రికార్డ్ క్రియేట్ అయ్యింది

Mahesh Babu

Mahesh Babu

సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతూ ఉంది. ఈరోజు స్పెషల్ గా మహేశ్ బాబు గురించి ఎలాంటి న్యూస్ కానీ, ఫారిన్ టూర్ నుంచి మహేశ్ ఫ్యామిలీ ఫోటో కూడా బయటకి రాలేదు. మరి ఎందుకు ట్రెండ్ అవుతుందా అని చూస్తే… ఇదే రోజు సరిగ్గా ఏడాది క్రితం మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యింది. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారి అంచనాల మధ్య మే 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. మొదటి రోజు మార్నింగ్ షోకే యావరేజ్ రివ్యూస్ సొంతం చేసుకున్న సర్కారు వారి పాట సినిమా ఇండియాలో ఒక రీజనల్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.

Read Also: Puri: కొత్త సినిమాకి రెడీ అవుతుండగా… షాక్ ఇచ్చిన ‘లైగర్’ బాదితులు

స్టార్ డైరెక్టర్ కాదు, సూపర్ హిట్ సినిమా కాదు కానీ సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ డే ఏకంగా 75 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఏ ఇండియన్ సినిమాకైనా ఇది ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ అనే చెప్పాలి. డే 1 బాక్సాఫీస్ దగ్గర కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన మహేశ్ బాబు, ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ రికార్డ్ ని కూడా సెట్ చేశాడు. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయిన సంధర్భంగా ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా యావరేజ్ కాకుండా, ఇంకొంచెం బెటర్ కంటెంట్ తో వచ్చి ఉంటే మహేశ్ బాబు నాన్-స్టార్ డైరెక్టర్ తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చే వాడు. ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ తో కలిసి SSMB 28 సినిమా చేస్తున్నాడు. అనౌన్స్మెంట్ తోనే సాలిడ్ బజ్ జనరేట్ చేసిన ఈ కాంబినేషన్ మూడో సారి అయినా హిట్ ఇస్తారేమో చూడాలి.

Show comments