Site icon NTV Telugu

Mahesh-Rajamouli Movie: ముహూర్తం ఫిక్స్.. లాంచ్ చేసేది ఆరోజే!

Mahesh Rajamouli Film

Mahesh Rajamouli Film

Mahesh Babu Rajamouli Movie To Start From January 26: మహేశ్ బాబు, రాజమౌళి సినిమా గురించి చాలాకాలం నుంచి చర్చలైతే జరుగుతున్నాయి. కానీ, ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. వచ్చే ఏడాదిలో ఇది సెట్స్ మీదకి వెళ్లొచ్చన్న ప్రచారాలూ జరుగుతున్నాయి కానీ, పర్ఫెక్ట్ డేట్ ఏది అన్నది స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే జక్కన్న తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కథని సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారన్న వార్తలైతే వస్తున్నాయి. అంతే.. అంతకుమించి మరే వివరాలు వెలుగులోకి రాలేదు. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ముహూర్తం ఫిక్స్ చేశారన్నదే ఆ అప్డేట్ సారాంశం!

ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారట! ఈ దిశగానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఆ తర్వాత పక్కా షెడ్యూల్స్ నిర్వహించి, నిర్విరామంగా చిత్రీకరణ జరిపేలా పక్కా ప్రణాళికలు రచించనున్నట్టు ఇన్‌సైడ్ న్యూస్! అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం.. ఫ్యాన్స్‌కి పండగే! బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో జక్కన్న స్థాయి మరింత పెరిగింది కాబట్టి.. ఈ ప్రాజెక్ట్‌ను ‘అంతకుమించి’ అనిపించేలా తీర్చిదిద్దుతున్నాడని సమాచారం. ఇది ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో రూపొందనుందని స్వయంగా విజయేంద్ర ప్రసాద్, ఇదివరకే పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

కాగా.. ప్రస్తుతం మహేశ్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. చాలాకాలం నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా, ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత సెట్స్ మీదకి వెళ్లింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే వెల్లడించింది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version